బెళుగుప్ప - Belluguppa

వీడియోలు


కామారెడ్డి జిల్లా
మహిళలూ.. మిమ్మల్ని రక్షించే ఈ చట్టాల గురించి తెలుసా?
Mar 06, 2025, 10:03 IST/

మహిళలూ.. మిమ్మల్ని రక్షించే ఈ చట్టాల గురించి తెలుసా?

Mar 06, 2025, 10:03 IST
మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు, వారికి రక్షణ ఇచ్చేందుకు భారత రాజ్యాంగం వారికి ప్రత్యేక హక్కులను కల్పించింది. గృహహింస-మహిళల రక్షణ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. ఈ చట్టం ఆర్థిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక వాష్‌రూమ్‌ కల్పించేందుకు, శ్రామిక మహిళలకు భద్రత కల్పించేందుకు మహిళలపై లైంగిక హింస నివారణ చట్టాన్ని 2013లో తీసుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేసే మహిళలు మొదటి ఇద్దరు పిల్లలకు 6 నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొందేందుకు వీలుగా ప్రసూతి ప్రయోజన చట్టాన్ని1961లో ప్రవేశ పెట్టారు. మైనర్లను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకే POCSO-2012 చట్టం రూపొందించారు.