న్యూయార్క్‌లో మరోసారి తడబడ్డ జో బైడెన్‌..! VIDEO

68చూసినవారు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..! ఇప్పటికే పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై మతిమరుపు, తడబాట్లతో తీవ్ర విమర్శలపాలైన బైడెన్‌.. తాజాగా మరోసారి అదేపొరపాటు చేసి మీడియాకు చిక్కారు. ఇటీవలే న్యూయార్క్‌లోని బార్‌క్లే హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో.. బైడెన్‌ తడబడ్డారు. ‘వెల్‌కమ్‌ టు వాషింగ్టన్‌’ అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్