ధర్మవరం మండలం మోటమర్ల వద్ద ఉన్నకేజీబీవీలో నాన్ టీచింగ్ సిబ్బందిగా ఎన్నికైన వారికి మండల ఎంఈఓ గోపాల్ నాయక్ రాజేశ్వరి దేవి నియామక పత్రాలు అందజేశారు. సోమవారం ధర్మవరం ఎంఈఓ కార్యాలయంలో ఎన్నికైన సిబ్బందికి ఎంఈఓలు అవగాహన కల్పించి సిబ్బంది విద్యార్థులతో క్రమశిక్షణగా మెలగాలని సూచించారు.