వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీగా ముదిగుబ్బ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు భాస్కర్ ను అధిష్ఠానం మంగళవారం నియమించింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తన మీద నమ్మకముంచి జిల్లా సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.