అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. గురువారం ధర్మవరంలో సీఐటీయూ మండల కన్వీనర్ రమణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న అద్దెలను చెల్లించాలని కోరారు.