ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ బుధవారం తన సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ. పట్టణంలోని 40 వార్డుల్లో బకాయి ఉన్న ఆస్తి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించరాదని, కొత్తగా పన్నులు వేసే విషయంలో ప్రభుత్వ నిబంధనల కంటే తక్కువ వేయరాదని సూచించారు. భవిష్యత్తులో పన్నుల వసూళ్లు అధికంగా చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.