ధర్మవరం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రంగా థియేటర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను వేరే చోటుకు మార్చాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో సిపిఐ కార్యకర్తలు బుధవారం విద్యుత్ శాఖ ఏఈ కి వినతి పత్రం అందించారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, నెల రోజుల క్రితం ఒక వృద్ధురాలు కూడా తీవ్రంగా గాయపడినట్లు వారు తెలిపారు.