ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో బుధవారం పర్యటించిన కరువు బృందం సభ్యులు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని పేర్కొన్నారు. కేంద్ర కరువు బృందం సభ్యులు పోన్న స్వామి, కనోజియా మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని పరిశీలించి రైతులు అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. వాటిని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని పేర్కొన్నారు.