ధర్మవరంలోని 39 వ వార్డు రాంనగర్కు చెందిన చేనేత మహిళ పూజారి ప్రమీల అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు జింక చంద్రశేఖర్ ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి బీజేపీ, మంత్రి సత్య కుమార్ అండగా ఉంటారని భరోసా కల్పించారు.