ధర్మవరం మండలం నెలకోటకి చెందిన యు.రంగారెడ్డి హిందూపురం పార్లమెంట్ వైసీపీ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ధర్మవరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.