ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న గంగాదేవి అనే వివాహిత మంగళవారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త వెంకటేష్ గమనించి హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి గంగాదేవిని తరలించి చికిత్స అందించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.