ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉన్న మల్లికార్జున ప్రొద్దుటూరుకు అయ్యారు. ఆయన స్థానంలో జమ్మలమడుగు కమిషనర్ ప్రమోద్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ధర్మవరం మున్సిపల్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.