భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై పార్లమెంట్ లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త యనమల నరేశ్ అన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం ధర్మవరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన చేపట్టామన్నారు. అంబేడ్కర్ ను అవమానించిన అమిత్ షాను అరెస్ట్ చేయాలన్నారు.