గోరంట్ల మండలంలోని మలసముద్రం పంచాయతీ బుదిలివాండ్ల పల్లి గ్రామంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె. పార్థసారథి ఆదేశాల మేరకు పంచాయతీ సర్పంచ్ సువర్ణ-అశ్వర్థ రెడ్డి ఆధ్వర్యంలో (ఎంపీ నిధులలో) సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలసముద్రం పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.