గుత్తి పట్టణంలోని 22వ వార్డు నమాజ్ కట్ట వీధి సమీపంలో ఆదివారం రాత్రి విద్యుత్ తీగలు తెగి రోడ్డు మీద పడ్డాయి. ఆ సమయంలో రోడ్డు మీద జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో కూడా విద్యుత్ తీగలు తెగిపడ్డాయని కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ తీగలను తొలగించి నూతన విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని కోరారు.