గుంతకల్లు మండలంలోని మల్లేనపల్లి గ్రామంలో సోమవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ జై వర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని వారు తెలిపారు.