శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ రెవెన్యూశాఖా మంత్రి సత్యప్రసాద్, రోడ్డు రవాణా శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలను గురువారం కోరారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు ఇంటి పట్టాలు, వసతి గృహాలకు, ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాల పునరావాసానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించామన్నారు. అలాగే గూగూడుకుళ్లాయి స్వామి పుణ్యక్షేత్రానికి నిధులివ్వాలని కోరారు.