గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన టోపీ పీరా అనే వ్యక్తి గురువారం విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గుర్తించి గార్లదిన్నె ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.