గుంతకల్లు మున్సిపాలిటీలో ట్రీ ప్లాంటేషన్ సుందరీకరణలో భాగంగా సోమవారం 60 ఫీట్ రోడ్డులోని డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు మధ్యలో గల మొక్కలు ఏపుగా పెరిగి వాహనాదారులకు ఇబ్బందిగా మారడంతో ప్లాంటేషన్ సుందరీకరణలో భాగంగా మొక్కలను తొలగిస్తున్నామని ఆయన చెప్పారు.