గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని సీఐటీయూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ శనివారం పరిశీలించారు. నీటి సమస్య ఉందని కాలనీ ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పైప్ లైన్ ఏర్పాట్లు పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కమిషనర్ ఆదేశించారు.