గుత్తి బస్టాండ్ లో శనివారం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. షరీఫాబి అనే వృద్ధురాలు తన కూతురుతో డోన్ నుంచి గుత్తికి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. త్వరగా బస్సు ఎక్కాలంటూ తనపై డ్రైవర్ చేయి చేసుకున్నారని వృద్ధురాలు ఆరోపించారు. గుత్తి బస్టాండ్ లో ఆమె బంధువులు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. ఎస్ఐ సురేష్ విచారణ చేపట్టారు. డ్రైవర్ క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.