గుత్తిలోని ఎస్సీ కాలనీకి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నగదాని గిడ్డమ్మ సోమవారం మృతి చెందారు. గిడ్డమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిడ్డమ్మ మృతికి తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు.