గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బొలికొండ రంగనాథ స్వామి దేవాలయంలో కార్తీక శనివారాన్ని పురస్కరించుకొని అత్యంత ఘనంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ అర్చకులు రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.