గుత్తి మండలం బాచుపల్లిలో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించి ఇంటి స్థలాలను డబ్బున్న వారికి కట్టబెట్టారని చెట్నేపల్లికి చెందిన గద్దల మస్తానప్ప అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులు ఈ ఘటనపై విచారణ చేయాలని ఎనిమిది మందితో కూడిన విచారణ బృందాన్ని గురువారం బాచుపల్లికి పంపారు. విచారణ బృందం ఇంటి స్థలాల అవకతవకలపై విచారణ చేశారు.