గుత్తి మండల కేంద్రంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ పేర్కొన్నారు. గుత్తి మండలంలోని చర్లపల్లి గ్రామంలో మంగళవారం పల్లె పండుగ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రహదారులు, మురుగు కాలువలలకు భూమి పూజ చేశారు. ఉపాధి హామీ నిధుల ద్వారా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.