తిరుమలలో లడ్డూ కల్తీ అంశంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు

65చూసినవారు
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై హీరో సుమన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంతకల్లులో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లడ్డూ వివాదం పై స్పందించారు. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోందని లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలన్నారు. డిక్లరేషన్ అంశం వారి వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలన్నారు. కానీ లడ్డూ కల్తీ అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు.

సంబంధిత పోస్ట్