గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా పామిడి సమీపంలో కట్టకిందపల్లి దగ్గర గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దుబ్బసానిపల్లికి చెందిన వెంకటేష్ (43)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.