పామిడి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం కూటమి ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల సమన్వయకర్త ఆర్ఆర్ రమేష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 1 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న క్రియాశీలక టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా కలిసి విజయవంతంగా సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని ఈ సందర్భంగా కూటమి నాయకులకు సూచించారు.