గుత్తి: ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి

70చూసినవారు
గుత్తి: ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి
గుత్తి పట్టణంలోని బాలుర, బాలికల ప్రభుత్వ వసతి గృహాలను మంగళవారం సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ చారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాల్లోని బాత్రూములు, వసతి గదులను తనిఖీ చేశారు. వంట గదులు, బాత్రూములు అపరిశుభ్రంగా ఉండడంతో వార్డెన్లను మందలించారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గంగాధర్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్