అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. మంగళవారం ఆయన గుంతకల్లు రూరల్ పి. ఎస్, సర్కిల్ ఆఫీస్ మరియు వన్ టౌన్, టూటౌన్ పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు స్టేషన్లలోని లాకప్, రిసెప్సన్, జి. డి మరియు రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు సమీక్షించారు.