గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి జగనన్న కాలనీ వాసులు మంగళవారం శ్రమదానంతో కాలనీకి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో జగనన్న కాలనీవాసులు రోడ్డు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విన్నవించారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో జగనన్న కాలనీవాసులు శ్రమ దానంతో రోడ్డు నిర్మించుకున్నారు.