గుత్తిలో ముగిసిన కౌన్సిల్ సమావేశం

52చూసినవారు
గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో చైర్మన్ వన్నూర్ బీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తమ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, నీరు, కుక్కల బెడద, విద్యుత్ లైట్లు వంటి సమస్యలను వారి దృష్టి కి తీసుకువెళ్లారు. వెంటనే సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్