గుత్తి పట్టణంలోని గుంతకల్-కర్నూల్ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులకు వాపోతున్నారు. ఆర్.అండ్.బి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీ వారు కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రోజు చాలా మంది కింద పడి ఆసుపత్రుల పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు గానీ, రాజకీయ నాయకులు గానీ స్పందించి చర్యలు తీసుకుని ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా కాపాడాలని పట్టణం ప్రజలు మరియు ప్రయాణికులు కోరుతున్నారు.