మృతుల ఓట్లు తొలగిస్తున్నాం: ఆర్డీఓ శ్రీనివాస రెడ్డి

676చూసినవారు
మృతుల ఓట్లు తొలగిస్తున్నాం: ఆర్డీఓ శ్రీనివాస రెడ్డి
గుంతకల్లు నియోజకవర్గంలో మృతుల ఓట్లు జాబితా నుంచి తొలగిస్తున్నామని ఎలక్ట్రోల్ అధికారి, ఆర్డీఓ శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే 7వేల మందికిపైగా మృతుల ఓటర్ల వివరాలను రద్దు కోసం ఆన్లైన్లో పొందుపరచామని అన్నారు. రెండేసి ఓట్లు ఉన్న 6, 073 మందికి వారి అభిప్రాయం మేరకు ఒక చోట ఉండేలా నోటీసులు పంపామని అన్నారు. ఆయనతో పాటు తహశీల్దారు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్