హిందూపురంలో మురుగునీరుగా మారిన తాగునీరు

82చూసినవారు
హిందూపురంలోని బ్యాంకు కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు వృధా అవుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి త్రాగునీరు మురుగునీరు పాలవుతోందన్నారు. సమస్య మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే సిబ్బంది వచ్చి గొయ్యి తవ్వి వెళ్లిపోయారని అన్నారు. త్రాగునీటి ఎద్దడి ఏర్పడిన హిందూపురంలో నీరు వృధా అవ్వడం చాలా దారుణమని, దీనిపై కమిషనర్ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్