ఘనంగా వాసవీమాత ఉత్సవాలు

61చూసినవారు
ఘనంగా వాసవీమాత ఉత్సవాలు
హిందూపురం పట్టణంలోని శ్రీనివాసథియేటర్ వెనుక భాగంలోని బాలాజీ దేవాలయంలో మేళాపురం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వాసవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాసవీ మాత విగ్రహాన్ని ముత్యాల పందిరిలో ఉంచి పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాలు, హోమం నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మినారాయణ, అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి రాజానాగేంద్రప్రసాద్, ట్రెజరర్ శివానందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్