వృద్ధాప్యంలో ప్రతి నెలా రాబడి పొందాలంటే 'సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్'లో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఏడాదికి ఈ స్కీమ్‌లో 8.2 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. రూ.30 లక్షల పెట్టుబడికి ఏడాదికి రూ.2.46 లక్షల వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు రూ.20,500లు పొందొచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సంప్రదించి, వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.