సామూహిక అత్యాచార బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం బహుజన చైతన్య వేదిక బృందం హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించి మనోధైర్యం కల్పించేందుకు వెళ్లగా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధితులను కలవడానికి వీలులేదని తెలపడంతో ఆసుపత్రి సూపరిండెంట్ తో మాట్లాడి భాదితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.