హిందూపురం మండలం కిరికెర గ్రామంలో ఎంపీడీవో నరేంద్ర కుమార్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టిడిపి నాయకులు పాల్గొని ఇంటింటికి తిరిగి మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్, పెన్షన్లు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు, రైతులకు మేలు చేసే విషయాలు, వరదల విషయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, పాలసూరి, మూర్తి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.