బీడీ కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఓబులు డిమాండ్ చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ బీడీ అండ్ సిగార్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఓబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన బీడీ కార్మికులకు సంబంధించిన సంక్షేమ చట్టాలను పునరుద్దించాలన్నారు.