జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ లో శుక్రవారం రోడ్డు భద్రత నియమాలు గురించి వాహనదారులకు, డ్రైవర్లకు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కదిరి ఏఎంవిఐ రాజేష్ ఆధ్వర్యంలో రవాణా శాఖ సిబ్బంది వాహనదారులకు, డ్రైవర్లకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది.