కదిరి రూరల్ మండలం చలమకుంట్లపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన గంగులప్ప గోడ కూలి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం స్థానికులు అందించిన వివరాలు మేరకు కదిరి పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఒక ఇంటిని ఒప్పందం తీసుకొని ఆ ఇంటి గోడలు తొలగిస్తూ ప్రమాదం జరిగింది. ఇంటి ప్రహరీ గోడ కూలి మీద పడడంతో గంగులప్ప అనే వ్యక్తి అక్కడక్కడ మరణించడం జరిగింది. మృతునికి ముగ్గురు కుమారులు ఒక భార్య వున్నారు.