ఆర్టీసీ బస్టాండ్లో షాపులు ఖాళీ స్థలాల అద్దెకు టెండర్ల ఆహ్వానం

51చూసినవారు
ఆర్టీసీ బస్టాండ్లో షాపులు ఖాళీ స్థలాల అద్దెకు టెండర్ల ఆహ్వానం
కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో షాపులు, ఖాళీ స్థలాలు అద్దెకు ఇవ్వనున్నట్లు డిపో మేనేజర్ ఎస్. హరిత శనినివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అక్టోబర్ 4వ తేదీ వరకు టెండర్ ఫారాలు ఇవ్వనున్నట్లు వివరించారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా టెండర్లు దాఖలు చేయాలని సూచించారు. ఆసక్తి కలిగిన వారు టెండర్లు దాఖలు చేసుకోవచ్చని ఇందుకు సంబంధించి ఈ నెల 30వతేదీన ఉదయం 11 గంటలకు కార్యాలయంలో అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్