కంబదూరులో అత్యంత వైభవంగా గంగమ్మ జాతర

64చూసినవారు
కంబదూరులో అత్యంత వైభవంగా గంగమ్మ జాతర
కంబదూరు మండల కేంద్రంలో బెస్త కులస్థుల ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో గంగమ్మ జాతరను నిర్వహించారు. ఉదయం నుంచి గంగమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. మొక్కుబడి ఉన్న భక్తులు అమ్మవారి కలశాలను మండలకేంద్రంలోని పురవీధులకుండా ఊరేగింపు నిర్వహించారు. కలిశాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్