నాలుగు దశల్లో NEET UG లీకేజీపై సీబీఐ విచారణ

75చూసినవారు
నాలుగు దశల్లో NEET UG లీకేజీపై సీబీఐ విచారణ
నీట్ యూజీ-2024, నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తునకు సిద్ధమైంది. ఇప్పటికే లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నాపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ, పరీక్షా కేంద్రాలకు పంపిణీ తదితర విషయాలపై లోతుగా దర్యాప్తు చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్