కళ్యాణదుర్గం పట్టణంలోని సీ. అండ్. జీ మిషన్ చర్చిలో బుధవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువు ప్రేమ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారని తెలిపారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పాస్టర్ నారాయణ పాల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.