శ్రీరామిరెడ్డి మంచినీటి పథకానికి సంబంధించిన ప్రధాన పైప్ లైన్ బోరంపల్లి వద్ద పగిలిపోవడంతో కళ్యాణదుర్గం పట్టణంలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ విలేఖరులకు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3గంటల తర్వాత నీటి సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. బోయవీధి, వడ్డే కాలనీ, శంకరప్పతోట, కమాన్ చెట్లవీధి, ఎర్రనేల, జయనగర్ కాలనీ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.