కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జేఏసీ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను కేంద్ర అమిత్ షా కించపరిచే విధంగా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.