కంబదూరు మండలం ఓబగానపల్లి గ్రామంలో ఉన్న తిమ్మాపురం గ్రామ సచివాలయం-2లోని విలేజి క్లినిక్ వద్ద ఉన్న అప్పటి సిఎం జగన్ పేర్లతో ఉన్న శిలా పలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి ధ్వంసం చేశారని ఆ గ్రామ వైకాపా నాయకులు, ఎంపిటిసి విద్యావతి భర్త బసప్ప బుధవారం తెలిపారు. గ్రామ సచివాలయ పరిసర ప్రాంతంలో కర్ణాటక మద్యం ప్యాకెట్లు విచ్చల విడిగా పడి ఉన్నాయని ఆ గ్రామ మహిళలు , ప్రజలు, సచివాలయ సిబ్బంది తెలియజేశారు.