కళ్యాణదుర్గం: మున్సిపల్ అధికారులు, కార్మికులు పోలీసు స్టేషన్ ముందు ధర్నా

71చూసినవారు
కళ్యాణదుర్గం మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త బిక్కీ హరి అసభ్య పదజాలంతో దూషించడం నేరమంటూ బుధవారం మున్సిపల్ సిబ్బంది, కార్మికులు టీ సర్కిల్, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కమీషనర్ ను అసభ్య పదజాలంతో తిట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. కళ్యాణదుర్గం టౌన్ సిఐ యువరాజ్ కు మున్సిపల్ అధికారులు, కార్మికులు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్